నూరేళ్ళ ఆరోగ్యాంగా జీవించాలి అనుకొంటే మాంసాహారం కాస్త తగ్గించి దాని బదులుగా గింజ పప్పులు అంటే బాదం,ఆక్రోట్,పిస్తా,సోయా చిక్కుళ్ళు పప్పులు తీసుకొంటే చాలు.  పప్పు సంబంధమైన ప్రోటీన్లు నిండిన ఇలాటి ఆహారం తీసుకునేవారి జీవనకాలం పెరుగుతున్నట్లు అధ్యయనాలు చెపుతున్నాయి . ఈ విషయం పై జపాన్ లో చేసిన 25 అధ్యయనంలో 20 ఏళ్ళ పాటు 70 వేల మందిని పరిశీలించి ఆసక్తి కరమైన విషయాలు వెల్లడించారు . శాఖాహారంలో లభించే మాంసకృత్తులు ఎక్కువగా తీసుకొన్నా వారిలో ,ఎలాంటి కారణంతో ఐన మరణించే ముప్పు 13 శాతం ఎక్కువగా ఉంటుందని చెప్పారు . మాంసం వాడకాన్ని మూడుశాతం తగ్గించినా చాలు అన్ని రకాల కారణాలలో సంబంవించే మరణం ముప్పు 34 శాతం తగ్గుముఖం పట్టిందని ,కాన్సర్ మరణాల ముప్పు 39 శాతం మరణాల ముప్పు 42 శాతం తగ్గుతుందని అధ్యయనాలు తేల్చాయి .

Leave a comment