ప్రతి రోజు తీసుకొనే ఆహరంలో ఒక వెజిటబుల్ సలాడ్ ఉంటే మంచిదే. సలాడ్స్ తో బోలెడన్ని యాంటీ ఆక్సిడెంట్స్ లభిస్తాయి. పచ్చి కాయగూరల ముక్కలు, ఉప్పు, మిరియాల పొడి, నిమ్మరసం కలిపి ఒక సైడ్ డిష్ లా భోజనం తో పాటు తీసుకోవచ్చు. కీర దోస ,టోమోటో, క్యారెట్, బీట్ రూట్ ,కాప్సికం, ఉల్లి, బ్రకోలి, కొత్తిమీర సలాడ్ గా తీసుకొవచ్చు. బెండకాయలు ,దొండకాయలు ,చిక్కుళ్ళు బీన్స్, ఆలుగడ్డ, స్వీట్ పోటాటో, క్యాబేజీ, కాలిఫ్లవర్ వంటివి సలాడ్ లా ఇష్టమైతే ఇవి ఒక భోజనంతో సమానం.సలాడ్స్ వల్ల జీర్ణ కోశం శుభ్రపడుతుంది. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. సలాడ్స్ ని రుచిగా తినాలి అనుకొంటే సోయాసాస్ చిల్లీసాస్ ,జీలకర్ర పొడి చాట్ మసాలా వంటివి చల్లుకోని తినవచ్చు.

Leave a comment