ప్రపంచ బ్యాంక్ తరఫున 2007 నుంచి వివిధ ప్రాజెక్టులు చేస్తున్న నాకు గ్రామీణ ప్రాంతాలు చాలా దగ్గరగా చూసే అవకాశం కలిగింది. ముఖ్యంగా హస్త కళాకారుల పరిస్థితులు చాలా దుర్భరంగా అనిపించాయి. దోపిడి చేసే దళారుల పైన ఆధారపడి బతుకుతున్నారు వాళ్లు. 2015 లో త్రిసర్ ఆర్టిసన్ ట్రస్ట్ పేరుతో లాభ ప్రేక్ష లేని ఒక సంస్థను ఏర్పాటు చేశాను 18 రాష్ట్రాల్లో వెయ్యికి పైగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన పదివేల మంది కళాకారులు దీని ద్వారా జీవనోపాధి పొందుతున్నారు అంటున్నారు మేఘ ఫన్సల్కర్. తెలంగాణ చేనేత, తమిళనాడు కాంజీవరం ఒడిస్సా లోని పట చిత్ర మహారాష్ట్రలో వెదురు మట్టితో చేసిన కళాకృతులు వంటి వెయ్యికి పైగా ఉత్పత్తులకు ప్రత్యేకమైన డిజైన్స్ అందించాము మహిళలు లక్ష మంది పైగా ప్రయోజనం పొందారు. ఈ ఏడాదిలో పదేళ్లలో నారీ శక్తి పురస్కారం తో పాటు పలు అవార్డులు అందుకున్నారు అవన్నీ నా బాధ్యతను పెంచాలనుకుంటున్న అంటున్నారు మేఘ ఫన్సల్కర్.

Leave a comment