మన పనులన్నీ వెలుగు రాగానే మొదలవుతాయి ఇంట్లో బయట అంతా వెలుగే ,కాంతే పుట్టినప్పటి నుంచి ఈ కాంతిని చూస్తూనే ఉన్నాం. కానీ ఈ కాంతిని ఉపయోగించి మానసిక అనారోగ్యాలను నయం చేస్తారు. దీన్నీ లైట్ థెరపీ అంటారు. కాంతిని ఒక పరిమితితో పద్ధతిగా శరీరం పైన ప్రసరించేలాగా చేస్తారు. కళ్ళకి తగలనీయకుండా ముఖం పైన పడి పదిహేను నిమిషాలు కాంతి పడేలా చేస్తారు మొదట్లో ఆ తరువాత దాన్నీ ఒక గంట వరకు పెంచుతారు. ఈ కాంతి తో శరీరంలో నడిచే జీవగడియారాన్ని ప్రభావితం చేస్తారన్న మాట. మానసిక సమస్యలు ,నిద్ర ,హార్మోన్ ల సమస్యలకు ఇది మంచి వైద్యం.

Leave a comment