నిద్ర రావటం లేదని విచారపడటం మొదటగా నిద్రలేమికి కారణం అవుతుంది అంటున్నారు డాక్టర్స్. ముందుగా బెడ్ రూమ్ ఉన్నది నిద్రపోయేందుకు మాత్రమేనని నిర్ణయించుకోవాలి. లైట్లు మొత్తం ఆర్పేయాలి. వెలుగు ఉంటే నిద్రను నియంత్రించే మెలటోనిన్ హార్మోన్ విడుదల కావటం తగ్గుతుంది. చీకటి శరీరాన్నీ విశ్రాంతి తసుకోమ్మని ప్రోత్సహిస్తుంది. మాటి మాటికీ గడియారం వంక చూడవద్దు . ట్రైస్టోఫోన్ కలిగిన ఆహారాలు నిద్రను తెప్పిస్తాయి. అరటి పండ్లు వేడిపాలు  ,పిండి పదార్థాలు నిద్రను తెప్పిస్తాయి.

Leave a comment