అందమైన బ్లవుజుఎంపిక చేసుకొంటేనే ఎలాంటి చీరె కైనా నిండుదనం వస్తుంది . ఇంతకు ముందు నలభై యాభై ఏళ్ళ క్రితం కూడా ఇదే మాదిరి ఫ్యాషన్ ఉండేది . కాంతివంతమైన బెనారస్ పట్టు సిల్క్ చీరెలకు హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేసిన  వెల్వెట్  బ్లవుజులు వాడేవారు . చీరెతో పోటీపడుతూ ఉండేవి . అలాగే ఆ డిజైనర్  బ్లవుజులు పట్టు చీరెలపైకి బుట్టచేతులు వాడేవారు . అలాగే ఎ బౌ ఎల్బో మోచేతి పై వరకు సినీనటి సావిత్రి కాలంనాటి ఫ్యాషన్ . ఇప్పుడు ఈ రెండు ట్రెండ్లు ముందుకు వచ్చాయి . పట్టు చీరెలకు ,సిల్కచీరెలకు మగ్గంవర్కు పట్టంచు వచ్చేలా సంప్రదాయ వస్త్రశైలి కి నప్పేలా పొడవాటి జాకెట్లు కుట్టించుకొంటున్నారు . జార్జెట్ ,బెనారస్ చీరెలకు బంగారు ధరలు అల్లిన డిజైనర్  బ్లవుజు ఫ్యాషన్ . అదీ మెరిసే వెల్వెట్ మీద బంగారు జరీ దరల అల్లికతో మరీ మెరిసి పోయే డిజైన్లు కొట్టేస్తున్నారు . ఏ వేడుకకైనా ఇవి చక్కగా నప్పుతాయి .

Leave a comment