సోఫోరా టోమాంటోసా అని ఒక అందమైన పొడవ్వాటి మొక్క ఒకటి గుమ్మమ ఎదురుగా నాటుకునేందుకు పనికి వస్తుంది. దీని ఆకులు వెండి కలసిన ఆకు పచ్చ రంగులో ఆకర్షణీయంగా ఉంటాయి. ఆకులు కాడలు అన్ని వెల్వెట్ వంటి వెండి రంగు నూగుతో కప్పి వుండటం వల్ల, దీన్ని మెరిసే పసుపు రంగు లో కొమ్మల చివర కుమ్కుల్లా పూస్తాయి. ఈ పూల రంగుని బట్టి దీన్ని ఎల్లో సోఫారా అంటారు. ఇది సంవత్సరం మొత్తం పూస్తూనే వుంటుంది. ఆఫ్రికా లో ఇళ్ళల్లోకి పురుగులు సాలిగూళ్ళు రాకుండా ఇంటి ముందు నాటుకొంటారట. ఈ చక్కని మొక్కను పెంచుకోవచ్చు.

Leave a comment