Categories
అతి మాములుగా ఉంటే గొప్పేముంది. అవసరము తీరాలి అందంగా వుండాలి. నలుగురు మెచ్చుకోవాలి అలావుంటేనే వస్తువుకైనా మార్కెట్ వుంటుంది . అదే గొడుగు పచ్చని అందమైన ఆకుల్లా వుంటే ,ట్రాన్స్ పరెంట్ గా అందమైన పూలతో నిండి వుంటే చూడగానే ఆకట్టుకునేలా వుంటే ఎంతో బావుంటుంది. అలా అందాల ఆకు గొడుగు మార్కెట్ ని ఏలేస్తోంది ఫోలియాజ్ అంబ్రిల్లాలు అటు వాన నుంచి కాపాడుతాయి చూసేందుకు అద్భుతంగా ఉంటాయి. ఫొటో షూట్ లో మంచి లుక్ ఇస్తాయి. ఈ గొడుగులు ఇప్పుడు మార్కెట్ లో కొత్త ట్రెండ్ సృష్టిస్తున్నాయి. అంటే చూడగానే కొనేస్తున్నారన్నమాట .