ప్రపంచ వ్యాప్తంగా అందరు ఆడవాళ్ళు సౌందర్య రక్షణ కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. పసి పిల్లలకు స్నానం చేయించే ముందు వెన్న రాసి నలుగు పెట్టి పోస్ అలవాటు చాలా మందికి వుంది. వెన్న సౌందర్య కరకం అని ఆయుర్వేదం చెప్పుతుంది. పశ్చిమ ఆఫ్రికాలో స్త్రీలు పొడి చర్మం గలవాళ్ళు, షీ బటర్ వాడుతారట . దీనితో ఎన్నో రకాల పూతలు తయ్యారు చేసుకుంటారు దీన్ని కరైట్ చెట్టు నుంచి లభించే గింజల నుంచి తయ్యారు చేస్తారు. పశ్చిమ ఆఫ్రికా లోని సవన్నా ప్రాంతంలో  ఈ చెట్లు పెరుగుతాయి. ఈ షీ బటర్ లో మేలు చేసే అమైనో యాసిడ్స్ ఉంటాయి. ఇవి చర్మాన్ని మెరుపుతో ఉంచుతాయి. ఇందులో విటమిన్ ఎ ఎంతో ఎక్కువ ముఖం చేతులకు కాళ్ళకు దీన్ని రాసుకుంటే మంచి ఫలితం ఉంటుందిట. కొరియన్ అమ్మాయిలు కొరియన్ షీట్ మాస్క్ లు, ఫేస్ మాస్కులు గా వేసుకుంటారు. చైనా ఆడవాళ్ళ జుట్టు పొడవుగా ఎదిగేందుకు బియ్యం కడిగినా నీళ్ళు ఉపయోగిస్తారు.

Leave a comment