ఈ వేసవిలో మొలకెత్తించిన పెసర్లు రోజు ఒక గుప్పెడు తింటే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయంటున్నారు పోషకాహార నిపుణులు. పెసర్ల లో 23 శాతం ప్రోటీన్లు ఉంటాయి క్యాల్షియం, మాంగనీస్, ఐరన్ వంటి ఖనిజాలు అధికంగా ఉంటాయి. శరీరానికి తగినంత శక్తి చేకూర్చేందుకు పెసలను ఉడికించి గుగ్గిలగా తినొచ్చు. దీని వల్ల కండరాల పని తీరు పెరుగుతుంది. క్యాలరీలు తక్కువ. త్వరగా ఆకలి వేయదు బరువు తగ్గవచ్చు. బీపీని అదుపులో ఉంటుంది. ఆహారం లో విష దోషాలను తొలగించుకునేందుకు చైనీయులు పెసర్ల ను విరివిగా తీసుకుంటారు. శరీరం లోని అనవసరమైన వ్యర్థాలను తొలగించే శక్తి వీటిలో ఉంది.

Leave a comment