సమ్మర్ కోసం ఎన్నో సరికొత్త డిజైన్ లు వచ్చాయి. వాటిలో అమ్మాయిలను విపరితంగా ఆకర్షించేది పలాజో శారీ స్టయిల్. ఇది స్టయిల్ గా కంఫర్ట్ గా కనిపిస్తుంది. కుర్తాకి బాటమ్ గా ధరించే పలాజో ప్యాంట్ కాస్తా వదులుగా ఉంటుంది. కొన్ని కుచ్చిలతో పలాజో స్కర్ట్ గా కనిపిస్తుంది. ఈ పలాజోకి వోణి జతచేస్తే పలాజో శారీ అయిపోతుంది. ఈ సీజన్ లో కంఫర్ట్ గా ఉండేందుకు కాటన్ ప్రింటేడ్ పలాజో ,కాలర్ నేక్ బ్లౌస్ జతగా పవిట చాలా అందంగా ఉంటుంది. కాస్తా ఫ్యాషన్ లుక్ కావలంటే పలాజో,బ్లౌస్ ఒకే రంగులో తీసుకొని పవిట కాంట్రస్ట్ గా ఉంటే డ్రస్ అద్బుతంగా ఉంటుంది. అలాగే బ్లౌస్,పలాజో ,పవిట ఒకే రంగులో ఉన్న అందంగానే ఉంటుంది.పార్టీ వేర్ గా పలాజో ని మించిన డ్రస్ లేదంటున్నారు ఎక్స్పర్ట్.

Leave a comment