వేసవి వచ్చిందంటే కాటన్స్ కోసం చుస్తారందరూ. శరీరానికి సౌఖ్యం గా వుండాలి. ఫ్యాషన్ గా వుండాలి. వర్క్ ప్లేస్ కు అనుకూలం గావుండాలి. ఈ విషయంలో ఫ్యాషన్ డిజైనర్లు ఏమంటారంటే వట్టి నూలురకాలే అక్కర్లేదు, లెనిన్, ఖాది, మల్ మల్ వంటి రకాలు ఎంచుకొవచ్చు అంటారు. వస్త్రం ఏదైనా డిజైన్స్ కూడా అందం తేవాలి. క్రాప్ టాప్ లు టీ షర్టులు, పలాజో, అనార్కలి మంచి పూల డిజైన్ ల తో వేసవి అనుకూలంగానే వుంటాయి. టాప్స్ అయిన, లేయర్స్ తరహ అయిన పలుచగా పొదలు పొదలు కుట్టేసినవె తీసుకోవాలి. అలాగే క్రేప్ టాప్, అనార్కలి, లాంగ్ గౌన్ ఎలాంటిదైన ఒక ఆర్గేంజా క్రేప్ టప్ను ఎంచుకొండి. ఆఫీస్ కు లేదా ఏదైనా ప్రోఫెషనల్ లుక్  కోసం బ్లేజరే వేసుకోవాలి. ఈ కాలంలో లెదర్ కష్టం కనుక కాలం కూడా ఇకత్ వంటి చేనేత రకాల తో రూపొందించిన జాకెట్లు, బ్లిజర్లు ప్రత్యామ్నాయంగా ఎంచుకోండి. ముదురు రంగులు కాస్త పక్కన పెట్టి తెలుపు, గులబీ, పసుపు, ఉదా, లేత నిలం లేదా నీలి రంగు వస్త్ర శ్రేణి ఎండ వేళల చెక్కగా అనిపిస్తాయి.

Leave a comment