వేసవిలో నగల ఎంపిక లో కాస్త జాగ్రత్త ముఖ్యం అంటారు నిపుణులు. సాధారణంగా పార్టీలు పెళ్లిళ్లు పర్యాటనలు వేసవి లోనే ఎక్కువ. టూర్స్ కి వెళ్ళినంత సాధారణంగా అనిపించే మినిమల్ జువెలరీ ఎంపిక చేసుకోవాలి. బంగారం కాకుండా వేరే లోహాల నగలతో అలర్జీలు వచ్చే ప్రమాదం ఉంటుంది తక్కువ బడ్జెట్ లో నకిలీ నగలు అందంగానే ఉండచ్చు గానీ వీటి వల్ల చర్మంపై దురద అలర్జీలు వస్తాయి . ప్లేటెడ్ బ్రాస్, కాపర్ నగలు ధరించాక చెమటకు తడిసి చర్మంపై ప్రభావం చూపెడతాయి. బంగారం ముత్యాల నగలు ఎటువంటి ప్రభావం చూపెట్టవు బంగారం, వెండి వజ్రాల నగలు ధరించి బయటకు వెళ్లి వచ్చాక కాసేపు ఆరనిచ్చి మెత్తని వస్త్రంతో తుడిచి భద్రం చేయాలి.

Leave a comment