ఇల్లు శుభ్రం చేయటంలో ఇంట్లో వాడుకొనే వస్తువులు మెయిన్ టెనెన్స్ చూసుకోవటం కూడా ఒకటి. ఫ్రిజ్ వెనుక ఉండే కండెన్సర్ కాయిల్స్ ను సంవత్సరానికి ఒక్కసారైనా శుభ్రం చేయాలి.ఫర్నెస్ ఫిల్టర్స్ మార్చాలి. ఎయిర్ కండిషనర్ గ్రిల్ ను శుభ్రం చేయాలి. స్మొక్ డిటెక్టర్ల బాటరీలు సంవత్సరానికి తప్పని సరిగా మార్చాలి. వంటింట్లో ఎగ్జస్ట్ ఫ్యాన్ ని నెలకొకసారి శుభ్రం చేయాలి. వాటర్ హీటర్ తుప్పు పట్టకుండా గమనించుకోవాలి. ఎమర్జెన్సి ప్లాష్ లైట్ ల బ్యాటరీలు పని చేస్తున్నాయో లేదో చెక్ చేయాలి. ఇంటి మూలల్లో ,బరువైన బీరువాలు ఎక్సర్ సైజ్ కోసం ఉపయోగించే వాకర్స్, సైకిల్స్ పెట్టే చోట నెలకొక సారన్న శుభ్రం చేయాలి. ఇవన్ని అవసరమైన వాడుకొనే వస్తువులు. ఏ క్షణంలో నైన పని చేయకపోతే చాలా ఇబ్బంది ముందే కాస్త పట్టించుకొంటే సమస్య లేకుండా ఉంటుంది

Leave a comment