తల్లి అవటం ఎంతో సంతోషం కలిగించేదే కానీ నెల తప్పిన దగ్గర నుంచి వేవిళ్ళ సమస్య భాదిస్తుంది . ఆ సమస్య ఉపశమనం కోసం కొన్ని చిట్కాలు పాటించవచ్చు . రోజుకు వీలైనన్ని సార్లు కొద్దికొద్ది గా ఆహారం తీసుకోవాలి రాత్రి పదుకొనె ముందర ఎంతో కొంత ఘనాహారం కడుపులో ఉండేలా చూసుకోవాలి మెలుకువ రాగానే వెంటనే మంచం దిగకూడదు . నిద్రనుంచి మెలుకువ రాగానే పది నిముషాలు కళ్ళు తెరిచి బెడ్ పైన అలాగే పడుకోవాలి ద్రవ పదార్దాలు ఒకేసారి తీసుకోకూడదు . భోజనానికి  భోజనానికి మధ్య మాత్రమే ద్రవపదార్దాలు తీసుకోవాలి అల్లం వేసిన టీ తాగటం అల్లం కొద్దిగా తీసుకోవటం ,కొంతవరకు వంతుల సమస్య తగ్గిపోతుంది . నిమ్మరసంలో నానబెట్టిన అల్లం ముక్క చప్పరించవచ్చు . వేపుళ్ళు తగ్గించాలి సాధ్యమైనంత నిద్ర పోవాలి . నిద్ర శారీరకంగా మానసికంగా ఉత్సాహంగా ఉంచుతుంది .

Leave a comment