వేవిళ్ళతో బాధపడే మహిళల్లో అబార్షన్ అయ్యే ప్రమాదం చాలా తక్కువ అంటున్నారు అధ్యాయనకారులు. మార్నింగ్ సిక్ నెస్ తో బాధపడే వేలమంది గర్భిణుల పైన చేసిన పరిశోధనలో వారి ఆరోగ్యానికి సంభందించిన విషయాలు నోట్ చేశారు. వేవిళ్ళు ఎక్కువగా ఉన్న వారిలో పది శాతం మందిలో అబార్షన్లు జరిగాయి, వేవిళ్ళకు పిండం ఎదుగుదలకు సంబంధం ఉందన్న విషయం తేల్చారు. గర్భవతులు తీసుకునే ఆహారంలో ఎన్నో సూక్ష్మజీవులు శరీరంలోకి గర్భస్థశిశువుకు హాని కలిగించే ప్రమాదం లేకపోలేదు. దీనివల్ల శరీరం చేసే పోరాటం వల్ల కలిగే ఇబ్బందే మార్నింగ్ సిక్ నెస్ అని అధ్యాయనకారులు తేల్చారు.

Leave a comment