చేనేతలో వాడే నూలును ముడివేసి అడ్డకంలో ముంచడం ద్వారా ఒక్కోచోట ఒక్కో రంగు అద్దుకునేలా చేయడం ఇకత్ టెక్నిక్. ఒరిస్సాలో తయారు చేసే ఇకత్ ఫ్యాబ్రిక్స్ పైన చిలుకలు, నెమళ్ళు వంటి జంతువుల బొమ్మలు తెప్పిస్తారు. ఆంధ్ర ప్రదేశ్ లో చారలు, గీతలు ఇకత్ ద్వారా తెప్పిస్తారు. ఇది చాలా సున్నితమైన పొరలతో చేసేది. ఒక ఫ్యాబ్రిక్ తయారీకి పట్టేకాలం ఎక్కువ. సాంప్రదాయకం గా ఒకే తరహా ఇకత్ వస్త్రాలు తయారు చేసే పద్ధతి నుంచి తమ పరిజ్ఞానం తోడుచేసి సరికొత్త డిజైన్స్ సృష్టించారు మోడరన్ డిజైనర్స్. ఇవి ప్రకృతి సహజమైన రంగులతో తయారయ్యేవి. రంగులు విలక్షణంగా వుంటాయి. ఇటువంటి ఈ కళను అంతరించి పోకుండా కాపాడి దాన్ని ప్రపంచ వ్యాప్తం చేసి అంతర్జాతీయ వేదికలపైకి తెచ్చిందీ ఫ్యాషన్ దిజైనర్సే. ఆంధ్రప్రదేశ్ తో పాటు ఒరిస్సా, గుజరాత్ లలో వెయ్యి సంవత్సరాలుగా ఈ ఇకత్ వస్త్రాలు తయారవుతున్నాయి. భారత్ నుంచి తూర్పు ఆసియా తీరాలన్నింటికి ‘ఇకత్’ వెళ్ళింది. ఇప్పుడు ఇకత్ డిజైన్స్ ఫ్యాషన్ స్టేట్ మెంట్స్.

Leave a comment