Categories
WoW

విడిగా చుస్తే టైల్స్ పరిస్తే కార్పెట్స్

గృహాలంకరణ లోకి ఇప్పుడు కార్పెట్ టైల్స్ వచ్చి చేరాయి. రబ్బరు, పప్లాస్టిక్ ఫలకలకు మంద పాటి కార్పెట్ దగ్గును అంటించి ఈ టైల్స్ తయ్యారు చేసారు. విడిగా చుస్తే టైల్స్ ఉంటాయి. నేల మీద అతికిస్తే కార్పేట్ లాగా అయిపోతాయి. కింద రబ్బరు వంటి నిర్మాణం వుండటం వల్ల ఫ్లోర్ ని పట్టీ ఉంటాయి. ఎక్కడన్నా వేయడం, తీయడం చాలా సులభం. పిల్లలు వీటి పైన పరుగెత్తినా శబ్దం రాదు. జారి పడిపోతారని భయం ఉండదు. ఏదైనా మరకలు పడినా ఆ ఒక్కటో రెండో టైల్స్ తీసి శుబ్రం చేసుకోవచ్చు. హాలు మొత్తానికి ఈ టైల్స్ వేసుకున్నా శుబ్రం చేయడం సమస్యే కాదు. అద్దె ఇల్లు అయినా సామాన్ల తో పాటు చుట్టి తీసుకెళ్ళి పోవచ్చు. ఇంత సౌకర్యంగా వుండే ఈ కార్పెట్ రకరకాల రంగుల్లో డిజైన్లు  గీతాలతో ఇంటికే కాస్త అందం ఇస్తాయి. ఇల్లు కొత్త లుక్ తో కనిపించాలంటే ఈ టైల్స్ వేరైటీస్ కోసం ఇప్పుడే చూడొచ్చు.

Leave a comment