Categories
Gagana

విజయ నిర్మలకు మరో పురస్కారం.

ఒకప్పటి స్టార్ హీరోయిన్, నటిగా మంచి స్థాయిలో ఉండగానే మెగా ఫోన్ పట్టుకుని అనేక సక్సెస్ ఫుల్ సినిమాలు డైరెక్ట్ చేసిన విజయ నిర్మలకు మరు అరుదైన పురస్కారం లభించింది. భారతీయ సినీ పరిశ్రమకు ఆమె చేసిన సేవలకు గాను యురేకు చెందిన రాయల్ అకాడమీ ఆఫ్ గ్లోబల్ పీస్ ఆమెకు గౌరవ డాక్టరేట్ ప్రకటించింది. 1957 లో తోలి సారిగా వెండి తెర పైన కనిపించిన విజయనిర్మల ఆ తర్వాత తెలుగుతో పాటు అనేక తమిళ, మలయాళ భాషల్లో నటించారు. నటిస్తూ ఉంటూనే దర్శకురాలిగా మారి 46 సినిమాలు తీసారు. భారతదేశంలో అత్యధిక సినిమాలు డైరెక్ట్ చేసిన మహిళా దర్శకురాలిగా ఆమె ఘనత వహించారు. ఆమె కృషికి ఇప్పుడీ పురస్కారం లభించింది.

Leave a comment