డోల్స్ అండ్ గబానా కంపెనీ ఈ తరం యువత కోసం కిచెన్ ఉత్పత్తులను అందమైన బొమ్మలతో డిజైన్ చేసి సిసిలి ఈజ్ మై లవ్ పేరుతో మార్కెట్లోకి విడుదల చేసింది. ఫ్రీజ్ లు,మిక్సీలు, స్టీల్ చిమ్నీలు, టోస్టర్లు సర్వం చిత్రకారుల చిత్ర లేఖనాలతో నిండిపోయాయి. ఈ వస్తువులతో ఇల్లు చూడచక్కని పెయింటింగ్ అయిపోతుంది. బోర్ కొట్టే వంటగది కళాత్మక వర్ణ చిత్రం అయిపోతుంది. విలాసవంతమైన బ్రాండ్స్ ఇవన్ని ఈ కంపెనీకి చెందిన డ్రస్ ఖరీదు కూడా లక్షల్లోనే ఉంటుంది. హ్యాండ్ బ్యాగ్ లు, యాక్ససరీస్ అన్ని అంతే చూసేందుకు విలాసవంతంగా ఉండే ఈ బ్రాండ్స్ వెంటవెంటనే అమ్ముడైపోతాయి.