Categories
Nemalika

వీళ్ళ వితరణను ఎలా అర్ధం చేసుకోవాలి

నీహారికా,

డబ్బు కనుక వుంటే అస్తమానం వెధవ పొడుపు కబుర్లు వినక్కరలేదు అన్నావు కదా… పొడుపు వేరు పనితనం వేరు. ఒక మంచి కబురు విను, వారెన్ భఫెట్, ప్రపంచంలో అతి పెద్ద జెట్ విమానాల కంపెనీ యజమాని. ఇంకో 63 బడాసంఘాలున్నాయి, అమెరికన్ బిజీనెస్ మాగ్నేట్, ఇన్వెస్టర్, ఫిలాంత్రఫిస్ట్, ప్రపంచపు అతి భాగ్యవంతుల్లో రెండో వాడు, ఆయన ఇంటర్వ్యూ చదివాను. ఇప్పుడు ఆయన వయస్సు 83. ఇప్పటికి తన కారు తనే నడుపుకుంటారు. డ్రైవర్, సెక్యూరిటీ గుర్డ్ లేరు. విమానాలు తాయారు చేస్తారు. కానీ సొంత విమానం లేదు. 50 ఏళ్ల క్రితం ఆయన కొనుక్కున్న ఇంట్లోనే ఇప్పటికి నివసిస్తున్నారు. నా ఇంట్లో కావాల్సినవన్నీ ఉన్నాయి. కొత్త ఇల్లు ఎందుకు? అనవసరపు ఖర్చులేందుకు అన్నాడు. ఓ ప్రశ్నకు సమాధానంగా, ఆయన బిల్గేట్స్ ని కలవాలనుకున్నాడట. బిల్గేట్స్ ఆయన భక్తుడై పోయాడట. ఖర్చులను తగ్గించుకున్న వాడే నిజమైన ధనవంతుడని నమ్మే ఆయన ఈ నాటికి సెల్ ఫోన్ వాడడు. షేర్ మార్కెట్ విషయాలన్నీ ల్యాండ్ ఫోన్ దగ్గరే కుర్చుని చూసుకుంటాడు.ఇవన్నీ విషయాలు చాలు కదా . మొత్తం ఇలాంటి వాళ్ళ జీవిత చరిత్రలో చదివితే డబ్బు ఎందుకు సంపాదిస్తారో, ఎందుకు కర్చు చేయాలో ఎందుకు ఉదారంగా డబ్బంతా ఏ సంస్థలకు కట్టుబడతారో తెలుస్తుంది.

Leave a comment