భారతదేశం లోని మొట్ట మొదటి పుస్తకాల పల్లెగా చెపుతారు మహారాష్ట్రలోని బిలార్ గ్రామాన్ని. ప్రకృతి రమణీయ కతవిలసిల్లే ఈ గ్రామంలో ఎక్కడ చూసిన పుస్తకాలే . గడప గడప కు గ్రంధాలయమే. ఫేక్ బుక్ ,వాట్సాప్ లలో కాలం గడిసే యువతలో పఠనాసక్తి పెంపొందించాలని ,పుస్తకం ఉనికి నిలబెట్టాలని మహారాష్ట్ర ప్రభుత్వం చేసిన గొప్ప ప్రయత్నం ఇది . 2007 లో బిలార్ లో పుస్తకం గ్రామం ఆలోచనకు బీజం పడింది. స్థానిక పాఠశాలకు కమ్యూనిటీ భవనాలు, లైబ్రరీలు మొదట ఎంచుకొన్నారు . తర్వాత స్థానికులే తమ ఇళ్ళలో పుస్తక గ్రంధాలయల ఏర్పాటును అనుమతి కోరారు . తమ గ్రామం అక్షరాస్యతలో ముందుండాలనే వారి కోరిక మాతృభాష పటిష్టం చేసుకోవాలనే అభిలాష బిలార్ గ్రామాన్ని పుస్తకాలతో నింపేసింది .

Leave a comment