నవ్వుతూ తుళ్ళుతూ అందరినీ  ఆటపట్టిస్తూ  ఎంతో చలాకీగా జలపాతాల్లా  కనిపించే టీనేజర్లతో ఇటీవల కాలంలో ఏదో ఓక్ టెన్షన్ కనిపిస్తోందని ఆందోళన గా కనిపిస్తున్నారని పలు సర్వే లు చెపుతున్నాయి. ఈ ఏజ్ లో బాలికల పై పడుతున్న ఒత్తిడి కారణంగా వారి మానసిక ఆరోగ్యం దెబ్బతింటోంది తాజా అధ్యయనం రిపోర్ట్. గర్ల్ గైడింగ్ యుకె. మెంటల్ హెల్త్ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించిన ఒక సర్వే ప్రకారం మేగజైన్లు వెబ్సైట్స్ లో కనిపించే సెలబ్రెటీల కబుర్లు వాళ్ళ జీవన విధానం వాటిని చూస్తున్న బాలికల పై తీవ్రమైన ఒత్తిడి కలుగజేస్తున్నాయి. ఈ ఆలోచనలు ప్రపంచంలోని అందరి అమ్మాయిలు ఒకేలా వుంటున్నాయంటారు. అందమైన రూపం ఉన్నవాళ్ళని చూసి తమను  తాము కించపరుచుకోవటం వారితో పోల్చుకోవటం పెరుగుతోందిట. వారిలా మారాలనుకునేవాళ్ళ సంఖ్యా పెరుగుతోంది. ఇది ఏ  స్థాయికి వెళుతుందంటే బాలికలు యువతుల్లా తమ వయసుకి మించి తమను తాము ప్రదర్శించుకునే దుస్తులు వేసుకోవాలి. ప్రయత్నిస్తున్నారు. టీనేజ్ యువతుల ఆలోచనల్నీ ఎప్పుడూ దీని గురించే పిల్లలు ఎవళ్ళ తోనూ పోల్చుకోకుండా వుండేలా  తల్లితండ్రుల వాళ్లకి గైడ్ లైన్స్ ఇవ్వాలని అధ్యయనం సూచిస్తోంది.

Leave a comment