పని చేసే సమయంలో ఆభరణాలు ధరిస్తే పాడవుతాయి. చర్మం పైన ఏర్పడే నూనె మురికి, చెమట ఆభరణాల మెరుపు పొగడతాయి అంటున్నారు ఎక్స్ పర్ట్. కొంచెం మైల్డ్ క్లీనర్ లో నీళ్ళు కలిపి  అందులో నగలు వేసి కాసేపు ఉంచి మెత్తని బ్రష్ తో శుభ్రం చేసి కడిగి ఆరనివ్వాలి. రాళ్ళ నగల్ని శుభ్రం చేసేప్పుడు ఆ రాళ్ళు ఊదిపోకుండా జాగ్రత్తగా శుభ్రం చేయాలి. ఇప్పుడు చల్లని రోజులో  ఉంగరాల వంటివి ధరించకపోతేనే మంచిది. చల్లధనానికి వేళ్ళు ముడుచుకుంటూ తెరుస్తూ ఉంటే ఆ తాకిడి లో ఉంగరం జారి పోవచ్చు. అలవాటైన ఉంగరం కనక జారిపోతున్నా తెలుసుకోవటం కష్టం. అలాగే సబ్బుతో నగల్ని గట్టిగా రుద్దుతూ కడగా కూడదు. సబ్బు నురగ నగల  రాళ్ళ సందున పేరుకుపోయి ఉంటుంది. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్న ఏ సింక్ లో ఉండే రంద్రాలలోకి నగలు జారి పోవచ్చు. విలువైన నగల్ని విలువగా కాపాడుకోవాలి. ఆభరణాలు భద్రంగా చూసుకోవాలి. అలాగే పండగ రోజుల్లో రద్దీగా ఉన్న ప్రాంతాల్లోకి నగలు ధరించి అవి ఎలాగో జారిపోయాక భాదపడిన ప్రయోజనం లేదు.

Leave a comment