థాంక్స్ అన్న పదం కంటే విలువైంది ఇంకేదీ లేదు అంటున్నారు ఇల్లినాయ్ యూనివర్సిటీ పరిశోధకులు 200 జంటలను ఎంపిక చేసి మూడేళ్ళ పాటు వారి జీవిత విధానాన్ని క్షుణ్ణం గా పరిశీలించారట వాళ్లలో కృతజ్ఞత చూపించుకునే అలవాటున్న దంపతులు చాలా సుఖంగా సంతోషంగా ఉన్నారట. అందుకే చిన్నపాటి సేవ అందుకొన్న వెంటనే థాంక్స్ చెప్పండి మనుష్యుల మధ్య బలమైన బంధం పెంచేది ఈ రెండు మాటలే అంటున్నారు పరిశోధకులు.

Leave a comment