బరువు పెరగాలని వుందా. రోజు ఖర్జురాలు తింటే చాలు వీటిలో షుగర్ పోషకాలతో పాటు అత్యంత విలువైన విటమిన్లు చాలానే ఉన్నాయి. శారీరానికి ఇవి తగినంత శక్తిని ఇస్తాయి. నరాల వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. బాగా పండిన ఖర్జుర పండ్లలో పోటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇందులో ఫైబర్ చాలా ఎక్కువ. కోలెస్ట్రాల్ పరిమాణాలను క్రమబద్దీకరిస్తాయి. వీటిని తరచు తింటే చర్మం ముడతలు పడతాయి. వీటిలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. జుట్టు రాలనివ్వదు. జుట్టు చక్కగా పెరుగుతుంది. ఎముకలను దృడపరిచే ఐదు అద్భుతమైన ఖనిజాలు ఈ ఖర్జురాల్లో పుష్కలంగా ఉంటాయి. వీటిలో ఉండే ఆర్గానిక్ సల్ఫర్ తో ఎలర్జీలు తగ్గిపోతాయి.

Leave a comment