పల్లెటూర్లలో రోడ్డు పక్కన ఎత్తైన చెట్లకు ఎర్రఎర్రని సీమచింతకాయలు వేలాడుతు నోరురిస్తుంటాయి. ఇవి మార్కెట్లలో చాలా చౌకగా దొరుకుతాయి. కాని ఔషధ గుణాలు పోషక విలువల విషయలో చాలా విలువైనవి. కాయల గింజలు, ఆకులు, చెట్ల బెరడు అన్నిటిలోనూ ఔషధ విలువలున్నాయి. ఇవి రోగ నిరోధకశక్తిని పెంచుతాయి. బ్లడ్ షుగర్ ,కొలెస్ట్రాల్ ను నియంత్రణలో ఉంచుతాయి. నోటి అల్సర్లను తగ్గిస్తాయి. సహజసిద్దమైన స్కిన్ మాయిశ్చరయిజర్ గా పని చేస్తాయి. వీటిలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. కనుక ఎముకలు దృడంగా ఆరోగ్యంగా ఉంటాయి.

Leave a comment