ఈ మధ్య విమాన ప్రయాణాలు అందరు చేస్తున్నారు. ముందు టైమ్ కలిసి వస్తుంది. అది మాత్రం కరెక్ట్ కాని విమాన ప్రయాణంలో తినే పదార్ధాల పై కూడా ఓ కన్నేయండి అంటున్నారు. ప్రసెస్డ్ పదార్ధాలు, చికెన్ ఫ్రై లు, ఎగ్ పఫ్ లు వంటి నూనె వస్తువుల జోలికి వెళ్ళకూడదు. బీరు, శీతల పానియాలు గాల్లోకి ఎగిరాక కడుపులో అజీర్ణానికి దారితీసి అసౌకర్యాన్ని కలిగిస్తాయి. విమానంలోని ప్రెజర్, హెచ్చు తగ్గులు, శారీరక హెచ్చు తగ్గులతో సరిపోతాయి. కనుక విమాన ప్రయాణాల్లో ఆహారం పట్ల్ల జాగ్రత్తగా ఉండాలి. తక్కువ సోడియం గల పదార్ధాలు తినాలి. యాపిల్స్, అనాస,పుచ్చ వంటి పండ్లు, క్యారెట్లు, మొక్క జొన్న వంటివి తినాలి. పాల ఉత్పత్తులు కూడా వద్దు. లీన్ ప్రోటీన్‌, గ్రిల్డ్ ఫిష్, చికెన్, మీట్, నట్స్, ఫ్రూట్ యాగర్ట్ హెర్బల్‌ పానీయాల్లో ఓ కప్పు టీ వంటివి శక్తి వంతంగా ఉంచుతాయి.

Leave a comment