ఆరోగ్యాన్ని ఎన్నో విధాలుగా రక్షించ గలదు వెనిగర్ . యాపిల్ ,ధాన్యాలు ,బంగాళాదుంపలు మొలాసిస్ లేదా వైన్ నుంచి తయాయ్యే వెనిగర్ సలాడ్స్ కు మాత్రమే కాదు . ఎన్నో ఇంటి పనులకోసం కూడా ఉపయోగ పడుతుంది . వెనిగర్ లో ప్రధానంగా నీరు కాకుండా ఎసెడిక్ యాసిడ్ ఉంటుంది విటమిన్లు ఉండవు . కొద్దిపాటి ఖనిజాలు మాత్రం ఉంటాయి హాని లేని చౌక ద్రవం ఆహార పదార్దాల్లోనూ ,ఇంటి పరిశుభ్రత కోసం వాడుకోవచ్చు . ఆహార పదార్దాల్లో బాక్టీరియా నశింపజేస్తుంది . అద్భుతమైన ప్రిజర్వేటివ్ . కెన్సర్ గా వాడితే తుప్పు,వస్త్రాలపై మరకలు పోగొడుతుంది . కాఫీ మేకర్స్ ,ఫ్రీజ్ లు ,కౌంటర్ టాప్స్ క్లినింగ్ కు సరైనది . చుండ్రు,పొడిచర్మాల  చికిత్స లో ఉపయోగ పడుతుంది .

Leave a comment