చక్కగా కనిపించేందుకు ముఖానికి మేకప్ ఒక్కటి  సరిపోదు శరీరం పట్ల పూర్తి జాగ్రత్త తీసుకోవాలి. చేతులను ఎప్పుడూ నెగ్లెట్ చేయకూడదు. ముందుగా దృష్టి పడే చేతులకు చక్కగా మెనిక్యూర్ చేయించుకోవాలి. క్వాలిఫైడ్ బ్యూటిషన్ చేత ఐ బ్రోస్ షేప్ చేయించుకోవాలి. స్నేహితులు కొన్నారు కదా అని కాకుండా, చర్మానికి సరిపడే బ్యూటీ ప్రొడక్ట్ ఎంచుకుని కొనుక్కోవాలి మొహంపై ఫౌండేషన్ చాలా పల్చగా ఉండి అందమైన చర్మాన్ని చూపెట్టాలి .మేకప్ కోసం ఎప్పుడూ క్రీమ్ బ్లష్ వాడాలి. ప్రతిరోజు ఫ్రెష్ గా కనిపించేందుకు రోజ్ వాటర్ తో మొహం కడుక్కోవాలి కళ్ళు స్ట్రెస్ ని,ఒత్తిడిని చూపిస్తూ అలిసిపోయి ఉంటే టీ బ్యాగ్స్ తో స్వాంతన  ఇవ్వాలి ఫేస్ యోగ ముఖ కండరాలకు స్వాంతన ఇస్తుంది తేమ తో తడిగా ఉండే పెదవులు ముఖ సౌందర్యాన్ని రెండింతలు చేస్తాయి.  పెదవులు పట్ల చాలా శ్రద్ధ తీసుకోవాలి.

Leave a comment