కోవిడ్  19 కారణంగా పెద్ద పెద్ద ఆఫీసుల్లో ఆన్ లైన్ వర్క్,వర్క్ ఫ్రమ్ హోమ్ నడుస్తోంది ఉద్యోగులు ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉండి ఆన్ లైన్ ఫ్లాట్ ఫామ్ పైన  పనిచేస్తున్నారు. ఈ సమయంలో కూడా కొంత సరదా ని షేర్ చేసుకునేలా రిబెల్స్ ఫుడ్ అనే ఫుడ్ డెలివరీ సంస్థ ఓ వినూత్నమైన పద్ధతి అందుబాటులోకి తెచ్చింది.అటు ఆఫీస్ లో ఇటు ఇళ్ళల్లో పనిచేసే ఉద్యోగులకు ఒకే సమయంలో పిజ్జా డెలివరీ ఇస్తోంది.అంటే వర్చువల్ గా అందరూ కలిసి పిజ్జా తింటూ పార్టీ చేసుకుంటారన్న మాట.డెలివరీ చేసే పిజ్జా తో పాటు అందించే బిల్లు తో పని వాళ్ల ఆరోగ్య హామీ పత్రం వివరాలుంటాయి.వైరస్ అంటుకునే వీలులేకుండా పదార్థాలు అల్ట్రావైలెట్ బాక్స్ లో డెలివరీ ఇస్తారు ఇందుకోసం ది వర్క్ కేఫ్ డాట్ కాం అనే ఆన్లైన్ ఫ్లాట్ ఫామ్ లో ఉద్యోగాల డేటాబేస్ అప్డేట్ చేస్తే ఆ సంస్థ లో పనిచేసే ఉద్యోగులు అందరికీ ఒకే సమయంలో ఆర్డర్ డెలివరీ ఇస్తారు.

Leave a comment