కోవిడ్ వైరస్ ముప్పు క్రమంగా తగ్గుతోంది. కానీ ఇంకా ఇలాంటి వైరస్ లు ఎప్పుడు ఏరూపంలో ఎటాక్ చేస్తాయో తెలియదు కదా. వాటితో పోరాడాలంటే సహజంగా దొరికే ఔషధ మొక్కల్ని ఎదో ఒక రూపంలో తీసుకోమంటున్నారు వైద్యులు. నోటి సువాసన కోసం తినే సోంపు మొక్క ఆకులు కాండం అన్ని ఆరోగ్యానికి మంచివే, ఈ మొక్క మొదట్లో ఉబ్బుగా ఉండే కాండాన్ని ఆకుల్ని మరిగించి కాషాయం లా తాగినా,గింజల్ని మరిగించిన నీళ్ళని తాగిన మంచిదే. ఈ మొక్క లేదా గింజల్లోని 28 రకాల పదార్ధాలు హుద్రోగాలు మధుమేహం రాకుండా కాపాడతాయి. కరివేపాకు లో విటమిన్లు ఖనిజాలు హానికరమైన బ్యాక్టీరియాని వైరస్ లను నిరోధిస్తాయి. కరివేపాకు తో చేసిన మౌత్ వాష్ తో వైరస్ ప్రభావం చాలా వరకు తగ్గిందట. ఇక వేప ఆకులతో 130 రకాల పదార్థాలు ఉన్నాయి. ఇందులో నుంచి తీసిన 20 రకాల పదార్థాలు కోవిడ్-19 ను అడ్డుకున్నాయి హెర్బల్ టీ లోను వేపాకులు కలుపుతున్నారు. రోజు పరిగడుపునే వేప చిగుళ్లు తింటే ఆరోగ్యం. పోషకాహార నిధి అయిన పుదీనా సీజనల్ గా వచ్చే అలర్జీలు లన్నింటికి మంచి మందు పుదీనా ఆకుల్లో ఒకటైన పెప్పర్ మెంట్ ఆకుల్లోని మెంథాల్, రోజు మారినిక్ ఆమ్లాలకు యాంటీ వైరల్ లక్షణాలు ఉన్నాయట. మింట్ రకాలన్నీ రోగాన్ని తగ్గించే ఔషధ వనరులే. తులసి ఔషధ రాణిగా పేరుపొందినది తులసి టీ తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అనేక రకాల వ్యాధులకు ఆయుర్వేద వైద్యులు ఉపయోగించి వైద్యం చేస్తారు వైరస్ ను అడ్డుకునే తులసి టీ ని ప్రతిరోజు తాగిన ప్రయోజనమే !

Leave a comment