నీహారికా,

మనకి సంగీతం ఇష్టమే కదా, కానీ ఇవాళో రిపోర్టు విషాద గీతాలు వినకండి మీ మనస్సు కుడా విషాదం తో నిండి పోతుందిఅంటున్నారు . విషాద గీతాలు మనం మనస్సులోని విషాదాన్ని తట్టి లేపి దిగులుకు గురి చేస్తాయట. మంచి మూడ్ కోసం సంగీతం వింటూ సేడ దీరే అలవాటు చాలా మందికి వుంటుంది. అయితే విషాద సంగీతం జీవితంలో ఎదురైన చెడు స్మృతుల్ని మనకు తెలియకుండానే తట్టి లేపి మనల్ని దిగులు పడేలా చేస్తాయి. పాటలో, సంగీతం, లిరిక్ బావుంది కదా అని ఇవే వింటే కష్టం సుమీ , మనస్సు శాంతిగా ఉండాలంటే సంతోషంగా వుండే పాటలు, హుషారెత్తించె సంగీతం వినాలత. అప్పుడే మనస్సు చైతన్యం తో గొంతు లేస్తుంది. అదే విషాద గీతం మనస్సుని మరింత సున్నితత్వానికి గురి చేసి భావోద్వేగాల ప్రభావాన్ని పెంచుతుంది. అంచేత మరీ మూడ్ బాగాలేక పొతే ఏడుపు పాటలు కాసేపు అవతల పెట్టాలన్న మాట.

Leave a comment