ఉదయం వేళ ఉత్సాహంగా పనులు ప్రారంభిస్తారు కానీ కాస్సేపటికి ఆ చురుకు దనం తగ్గిపోయి విసుగ్గా ఉంటే దానికి కారణం మన ఆహార అలవాట్లే అంటున్నారు అధ్యయనకారులు. సుఖంగా నిద్రపోయి ,మేల్కొన్న తరువాత రోజంతా ఇతర పనుల పైన ఆసక్తి ఏకాగ్రత కుదరక పోవటానికి కారణం పోషకాలు అందకపోవటమే అంటారు . శరీరం చురుగ్గా పని చేసేందుకు ఎన్నో శక్తివంతమైన పోషకాలు కావాలి . ప్రతి ఉదయం తేనె ,నిమ్మరసంతో ఉదయముణ్ణి ప్రారంభించాలి . బ్రేక్ ఫాస్ట్ చాలా పోషక విలువల తో కూడి ఉండాలి ప్రోటీన్లు ,కార్బో హైడ్రేడ్స్ ,పీచు తప్పనిసరిగా ఉండేలా పదార్దాలను ఎంపిక చేసుకోవాలి . ప్రతి మూడు గంటలకు ఒకసారి శరీరానికి ,మెదడుకి శక్తి నిచ్చే పదార్ధలు తీసుకోవాలి . అప్పుడే రోజంతా ఉత్సాహంగా ఉంటుంది అంటున్నారు ఎక్స్ పర్డ్స్ .

Leave a comment