Categories
Wahrevaa

విటమిన్ అదే. ప్రయోజనం వేరు.

విటమిన్లు శరీరానికి ఎంతో మంచివి. కానీ అవి శరీరానికి సమకూర్చే ఆహారంలోని తేడాల్లో వ్యత్యాసం వుంటుంది. సోయాబీన్స్, ఆలివ్ ఆయిల్స్ లో వుండేది విటమిన్-ఇ అయినప్పటికీ ఈ ఉత్పత్తుల ప్రభావం ఆరోగ్యం పై వేర్వేరుగా పని చేస్తుంది. కెనోలా, సోయా ఆయిల్స్ కంటే ఆలివ్ ఆయిల్ ప్రయోజనకరం. ఆలివ్ ఆయిల్ లో లభించే విటమిన్-ఇ ఆల్ఫా టోకోఫెరాల్ ఊపిరి తిత్తుల ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. అదే కేనోలా సోయాబీన్ ఆయిల్స్ లో లభించే విటమిన్-ఇ రకం ఊపిరి తిత్తులపై మంచి కంటే చెడె ఎక్కువగా చేస్తుంది. ఇందులో గమ్మా- టుకోఫిరాల్ స్థాయిల్ అధికంగా వుండటం వల్ల హాని జరుగుతుంది. అన్నింటి లోనూ వుండేది విటమిన్-ఇ కదా అనుకోకుండా అన్ని రకాలను పరిశీలించి పరిగణలోకి తీసుకోవాలి.

Leave a comment