ఆరోగ్యంగా ఉండాలంటే తగినన్ని విటమిన్స్, మినరల్స్ పోషకాలు శరీరానికి అందాలి. ఏ మోతాదు లో ఏ విటమిన్ తగ్గినా సమస్యే. శరీరంలో విటమిన్ డి ఉన్నట్లయితే కీళ్ళ నొప్పులు రానేరావంటున్నారు బర్మింగ్ హామ్ యూనివర్సిటీ పరిశోధకులు. అయితే ఒక సారి కీళ్ళ నొప్పులు వస్తే మటుకు ఎలాంటి ప్రయోజనం ఉండకపోవచ్చు నంటున్నారు. అయిటే ఎక్కువ మోతాదులో విటమిన్ డి ఇస్తే నొప్పుల తీవ్రత తగ్గచ్చు. డి విటమిన్ లోపం వల్లనే కీళ్ళ నొప్పులు, వాపులు కనిపిస్తాయని అందుకే ఈ విటమిన్ లోపం లేకుండా చిన్న తనం నుంచే శ్రద్ధ తీసుకోమని సలహా ఇస్తున్నారు పరిశోధకులు.

Leave a comment