ఆమ్మో మిరపకాయ అంటాం కానీ కారం లేని వంటను ఊహించలేం. ఆహార పదార్ధాల్లో కాస్త కారం ఎక్కువ తినే అలవాటు చాలా మందిది . ఈ అలవాటే లాంగ్ లైఫ్ ఇస్తుందనటున్నారు పరిశోధకులు. ఈ పరిశోధనలో కారం ఎక్కువ తినటం వల్ల అధిక బరువు సమస్య నుంచి కొంత వరకు తప్పించుకోవచ్చని రుజువైంది. పండు మిరపకాయను ఎదో రకంగా ఆహారంలో చేర్చుకోవటం వల్ల  పలు ఆరోగ్య సమస్యలు తగ్గించుకోవచ్చని స్పష్టమైంది. వీటిలో ఎ విటమిన్ బికాంప్లెక్ గ్రూప్ సి విటమిన్ లభిస్తాయి. పొటాషియం మెగ్నీషియం  ఐరన్  మాంగనీస్ వంటి ఖనిజాలు ఉంటాయి. అంతేగాని రక్తంలో షుగర్ లెవల్ తగ్గిస్తుంది. మిరప పండు. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచి స్ట్రోక్స్ రిస్క్ తగ్గిస్తుంది. మొత్తం మీద మిరపకాయలు శరీరంపై థెరప్టిక్ ప్రభావాన్ని చూపిస్తాయి. కారం తినటం వల్ల  దీర్ఘయషు సాధ్యమన్నా విషయాన్నీ స్పష్టం చేస్తూ హాట్ సాస్ తో డ్రై ఫ్లేక్స్  తో పోలిస్తే మిరపకాయల్లో ఎక్కువ ప్రయోజనాలు ఎక్కువగా ఉన్నాయని తేల్చారు పరిశోధకులు.

Leave a comment