బయటకు పోతే మంచి నీళ్ళు అవసరం అవుతాయి. పని తొందరలో తాగటం మరి పోతారు. తగినంత నీరు శరీరానికి లభించకపోతే ఆరోగ్య సమస్యలు వస్తాయి.  కొన్ని ఆహార పదార్ధాలలో సహజంగానే హైడ్రేట్ కావటానికి సహకరిస్తాయి. పెరుగులో 85 శాతం నీరే ఉంటుంది. ప్రోటీన్లు, విటమిన్ బి, కాల్షియంలకు మంచి ఆహారం కూడా.  బ్రొకోలిలో కూడా నీటిశాతం ఎక్కువే.  ఇందులో 80 శాతం నీరు , మిగతా 20 శాతం పూర్తి పోషకాలే. మిటమిన్ సి కూడా దొరుకుతాయి. లెట్యూస్ లో 95 శాతం నీరే ఉంటుంది. అన్నికంటే ముఖ్యం అన్నంలో 70శాతం నీరు ,ఐరన్ ,కార్బొహైడ్రేట్స్ ఉంటాయి. బయటకు వెళ్ళే సమయంలో పెరుగును తినాలి నూటికి నూరు పాళ్ళు ఆరోగ్యం.

Leave a comment