మన దేశపు గ్రామాల్లో వితంతువులకు ఎక్కడా లేని అనాధారణ ఎన్నో పట్టింపులు ఉంటాయి. వాళ్లు గాజులు, బొట్టు, పూలు ధరించకూడదు. శుభకార్యాలకు రాకూడదనే అంటారు అయితే మహారాష్ట్రలోని 7000 గ్రామాల్లో వితంతువులు భౌతిక వివక్షకు గురి కాకూడదనే నిర్ణయం తీసుకున్నారు మహారాష్ట్రలోని 7683 గ్రామాలు,1,182 మునిసిపల్ వార్డులు తాము వితంతువుల పట్ల వివక్ష చూపమని తీర్మానాలు చేశారు. వితంతువులు తమకు నచ్చిన దుస్తులు వేసుకోవచ్చు ఉద్యోగాలు చేసుకోవచ్చు అని వారిని ప్రోత్సహించేందుకు ముందుకు వచ్చాయి. మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లాలో ఆలయాల్లో వితంతువులు పూజలు చేస్తున్నారు. ఇదొక  ఉద్యమం లా సాగుతోంది.

Leave a comment