మనిషి సంఘజీవి అని ఎప్పుడూ తేలిన సత్యం. కానీ చాలా మంది ఒంటరి తనాన్ని కోరి తెచ్చుకుంటున్నారు. ఇప్పటి జీవన శైలిలో పదిమందిలో కలిసి కాస్సేపు కూర్చునేవీలులేదు. ఉంట్లే పని లేకపోతే ఫోన్లు సోషల్ మీడియా. యువత అలవాటు ఇదే. కానీ తాజా పరిశోధన ఒంటరి తనం సగం అనారోగ్యాలకి కారణం అంటున్నాయి.  దీన్ని  శాస్త్రీయంగా  అధ్యయనం చేస్తే ఒంటరిగా ఉన్న వాళ్ళతో రోగ నిరోధక శక్తీ తొందరగా క్షీణిస్తుందని ముఖ్యంగా కణాల్లో ఇన్ఫలమేషన్  అన్నది నలుగురి మధ్య ఉన్నవాళ్ళతో పోలిస్తే ఒంటరివాళ్లతో ఎక్కువని తేలింది. అంతేగాదు బాక్టీరియా వైరస్ లను ఒంటరివాళ్ళలో చురుగ్గా లేవనితేలింది. కొన్ని వ్యాధులను వాళ్ళు చురుగ్గా తిప్పి కొట్ట  లేక పోతున్నారని రిపోర్ట్. నలుగురితో కలిసి మెలిసి జీవించటంలో మనసు పంచుకోవటంలో ఆనందం పొందటంలో కలిగే లాభాలు ఒంటరిగా నిర్లిప్తంగా జీవించటంలో లేదని తేలింది. అందుకే చిన్నవాళ్లను కాస్సేపు ఫోన్లకి పక్కనే పెట్టి స్నేహుతులతో కుటుంబంలో కలిసి వుండే విలువైన సమయాన్ని పెంచుకోమని పెద్దవాళ్ళని ఒంటరితనం లోంచి బయటపడే మతగలను అన్వేషించమని హెచ్చరిస్తోంది రిపోర్ట్.

Leave a comment