ఒత్తిడి తో బరువు పెరిగి పోతారంటున్నాయి అధ్యయనాలు దీర్ఘకాలిక స్ట్రెస్ తో బాధపడేవారిలో స్థూల కాయం వచ్చే అవకాశాలు ఎక్కువగా వున్నాయని అధ్యయనాల్లో గుర్తించారు. అనేక నెలలు పాటు కార్డిసోల్ స్థాయులు అధికంగా ఉన్నపుడు మరింతగ బరువు పెరిగే అవకాశం ఉంది ఈ వత్తిడిలో అదే పనిగా ఏవో తినేస్తు వుండటం వల్ల ,అలాగే స్వీట్ ,చెక్కర ,క్యాలరీలు గల పదార్దాలు ఇష్ట పడటం వల్ల ఈ సమస్య వస్తుంది. స్ట్రెస్ హార్మోన్ కార్డిసోల్ జీవక్రియలో కొవ్వు ఎక్కడ వుంటుందనేది నిర్ణయించటంతో కీలకపాత్ర వహిస్తుంది. అంచేత బరువు పెరిగిపోతున్నామన్నా బాధతో మరింత ఒత్తిడిని పెంచుకునేకంటే ముందుగా వత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేయమంటున్నారు.

Leave a comment