వారానికి ఒక్కరోజు ఉపవాసం చేయడం వల్ల చాలా ఆరోగ్యంగా ఉంటారని శాస్త్రపూర్వకంగా నిరూపించాలి. అట్లాంటాలోని జార్జియా స్టేత్ పరిశోధకులు ఈ ఉపవాసం వల్ల వృద్దాప్యం దగ్గరకు రాదని ఎప్పటికీ యవ్వనోత్తేజంలో ఉంటారని చెబుతున్నారు. ఉపవాసం లేదా తక్కువ క్యాలరీలు ఉన్న ఆహారం తీసుకోవటం వల్ల వాటిల్లో బీటా హైడ్రాక్సీ బ్యూటిరేట్ అనే కీటోన్ ఉత్పత్తి అవుతుందని వారి అద్యయనాల్లో తేల్చారు. ఇది రక్త నాళాలు పైన వయసు ప్రభావం పడకుండా కాపాడుతుందని చెపుతున్నారు. వృద్దాప్యం ఆలస్యం కావటంతో పాటు వయసుతో వచ్చే ఎన్నో అనారోగ్యాలు అలసటతో దగ్గరకు రావంటున్నారు.

Leave a comment