శరీరంలో పేరుకుపోయే వ్యర్ధాలు ఎప్పటికప్పుడు తొలగించుకోకపోతే అది చర్మం పైన, జీవక్రియల పైన భారం పెంచుతుంది. శారీరక వ్యర్ధాలు తొలగించే పదార్ధాలు తరచూ తీసుకోవాలి. సి విటమిన్ సమృద్దిగా ఉండే నిమ్మరసం, తేనే తో కలిపి తీసుకుంటే శరీరంలో వ్యర్ధాలు వెళ్ళిపోతాయి. అలాగే బొప్పాయి పండులో కూడా వివిధ అవయవాల్లో వ్యర్ధాలను వెలుపలికి నెట్టే, జీర్ణ శక్తిని, వ్యాధి నిరోధక శక్తిని పెంచే గుణం పుష్కలంగా ఉంది. యాపిల్ లోని పెక్టిన్ అనే పదార్ధం పేగులలోని మలినాలను, వ్యర్ధాలను బయటికి నెట్టేస్తుంది. నేరేడు పండులో ఉండే యాంటి బయోటిక్ గుణాలు మూత్రాశయంలో వ్యర్ధాలు పేరుకోకుండా చేస్తాయి. అలాగే మజ్జిగ కూడా వ్యర్ధాలను వెలుపలికి పంపేస్తాయి. జ్ కీరా ముక్కలు తినడం వల్ల వ్యర్ధాలు బయటకు పోయి చర్మం తాజాగా నిగారింపుతో ఉంటుంది. పుచ్చకాయలోని సిట్రులినిన్ అనే పదార్ధం మూత్రపిండాలు, కాలేయాలను శుద్ధి చేసి కాపాడుతుంది. ఇంట్లో పనికి రాణి సామానులు ఇరుగ్గా కనిపిస్తూ ఎంతో విసుగు తెప్పిస్తుందో, శరీరంలోని వ్యర్ధాలు కూడా ఇంతే.

Leave a comment