ఖరీదైన పాఠశాలల్లో చదవే పిల్లలలో 90 శాతం మందికి ‘డి’విటమిన్ లోపం ఉన్నట్లు అధ్యయనాలు చెపుతున్నాయి. ఎ.సి స్కూల్ బస్,  ఎ.సి క్లాస్ రూమ్స్,  ఆటలకు అవకాశం లేని కార్పొరేట్ పాఠశాలలో ఎండా మొహం చూడని పిల్లల్లో ‘డి’విటమిన్ సమస్య వస్తోంది.  పూర్తిగా శాకాహారం తీసుకొనే పిల్లల్లో ఈ విటమిన్ లోపం మరింత ఎక్కువ .  తగినంత ‘డి’విటమిన్ వుంటేనే శరీరంలోని కీలకమైనా అంగాలు సమర్థవంతంగా పని చేస్తాయి.  చేపలు ,గుడ్లు ద్వారా కూడా ‘డి’విటమిన్ కొద్ది స్థాయిలో లభిస్తుంది.  పాలిష్ చేసిన ధాన్యం మాత్రం తినడం, సాఫ్ట్ డ్రింక్స్ తాగడం కూడా శరీరానికి కాల్షియం లోపాన్ని కలుగజేస్తాయి.   దాని వల్ల కూడా శరీరంలో ఎక్కువ శాతం ‘డి’విటమిన్ ను వినియోగించుకొంటుంది. కాసేపు ఎండలో ఉండటం ద్వారా ఈ ‘డి’ విటమిన్ ఉచితంగా శరీరానికి లభిస్తుంది.

Leave a comment