పొద్దుటి పూట నిద్ర లేవగానే జీవక్రియల పని తీరు బావుండాలంటే, అలసట, బద్ధకం పోవాలంటే రోజంతా చురుగ్గా ఉండాలంటే మూడ్ సరిగ్గా ఉండాలంటే అల్పాహారమే కీలకం. ఆ ఉదయపు పూత తీసుకునే ఆహారంలో పిండి పదార్ధాలు మాంసాకృతులు, ఖనిజాలు, విటమిన్లు ఇలా అన్ని రకాల పోషకాలు ఉండేలా చూసుకుని. ఆరోగ్యంగా వున్న వాళ్ళు ఇడ్లీ, దొసె, చపాతీ, ఉప్మా, జావ లేదా మజ్జిగ గుడ్డు, మొలకెత్తిన గింజలు, పండ్లు తీసుకోవాలి లేదా చిరుధాన్యాలతో చేసిన పదార్ధాల, తినొచ్చు అరవై దాటితే త్వరగా అరిగే ఇడ్లీలు, తక్కువ నూనె వెంసిన దోసెలు,  జావ లాగా చేసిన ఉప్మా తినచ్చు. మొత్తం మీద అల్పాహారం మాత్రం మానకూడదు. బరువు తగ్గుతాం అనుకుని ఉదయపు టిఫెన్ మానేస్తే ఆకలి పెరిగి మధ్యాహ్నం ఎక్కువ ఆహారం తీసుకోవడం మామూలే.

Leave a comment