మొహం కడుక్కునే విధానం మార్చుకుంటే ముఖం ఇంకెంతో కాంతి వంతంగా మారుతుంది. అంటున్నారు ఎక్స్పెర్ట్స్. రాత్రివేళ మేకప్ తీసివేసేందుకు ఉదయం నుంచి మొహానికి తగ్గితే కాలుష్యం వదుల్చుకునేందుకు సాధారణంగా అందరు స్నానం చేసేస్తారు. కానీ ఈ శుభ్రత నిద్రలేవగానే పాటించాలంటున్నారు. రాత్రివేళ నిద్ర పోతున్న సమయంలో శరీరం తనలో తానూ రిపేర్ చేసుకుంటుంది. ఈ స్థితిలో శరీరంలోని వృధాలు బయటకి విడుదల అవుతాయి. పగలంతా శరీరంలోని ప్రవేశించిన విషపదార్ధాలు బయటకి వచ్చేందుకు సిద్ధంగా  ఉంటాయి. ఉదయం వేళ  మొహం కడుక్కునేటప్పుడే శుభ్రంగా మేకప్ తీసేసినంతగా మొహం కడుక్కుంటే ఈ వ్యర్ధాలు తొలిగిపోయి చర్మ రంధ్రాలు తెరుచుకుంటాయి . మరీ ఎక్కువ వేడినీళ్ళతో ముఖం కడుక్కోకూడదు. శరీరంలో సహజంగా వుండే నూనెలు పోయి చర్మం పొడిగా అయిపోతుంది. చాలా తేలికైన సబ్బును మాత్రమే వాడాలి. లేకపోతే చర్మం లోని తేమ హరించుకుపోతుంది.

Leave a comment