నీహారికా,

నాకు కష్టాతి కష్టం అనిపించింది ప్రొద్దున్నే నిద్రలేవడం అంటే ఎంతో నవ్వొచ్చింది. నిద్ర వదులుకోవడం కష్టమే నన్న విషయం పక్కన పెట్టు కానీ ప్రకృతి ద్వారా అందుకోగలిగే ప్రయోజనాలు అనేకం ప్రతిరోజు సూర్యకాంతి లో కాసేపు తిరగగలిగితే ఎంత ఆరోగ్యం. ప్రకృతి విహారంగా పచ్చిక బయళ్ళు, పార్కుల్లో తిరగండి. ప్రకృతిలో వచ్చే సహజమైన వాసనలు, పూవుల రంగులు మనసు పైన ఎంతో ప్రభావం చూపెడతాయి. పక్షుల కిలకిలారావాలు, అరుణోదయపు కాంతులు, ప్రశంతమిన్ శబ్దాలు లేని వాతావరణం, నీలాకాశం, ప్రవహించే నదులు, జలపాతాలు, ఉప్పొంగే సముద్రం ఇవన్నీ ప్రకృతిలో భాగం కదా. కళ్ళు అలసినట్లు ఉంటే కాసేపు పచ్చని మొక్కల వైపు చూడు. చక్కగా ఫ్రెష్ గా వుంటుంది. మనసు సేదదీరాలంటే పువ్వుల్ని, మెరిసే ఉదయపు కాంతుల్ని చూస్తూ మౌనం గా నడిస్తే కొత్త శక్తి వస్తుంది. పాజిటివ్ ఫీలింగ్స్ తో మనసు నిండిపోతుంది.మనమూ ప్రకృతిలో ఒక భాగమే. అందుకే ప్రకృతికి దగ్గర గానే ఉండాలి. నాలుగ్గోడల మధ్యన క్లాస్ రూమ్ లో గంటల తరబడి చదువు ఎలాగూ వుంటుంది. ఆ ఎనర్జీ నింపుకొనేందుకు ఉదయం వేళ లేచి ఆ రోజుని ఆహ్వానించా. ప్రతి ఉదయం నీకు సంతోషాన్ని కానుకగా ఇస్తుంది.

 

Leave a comment