Categories
WhatsApp

ఉద్యోగం చేస్తున్న మహిళలు తక్కువే.

ప్రపంచ బ్యాంక్ విడుదల చేసిన ఒక నివేదిక ప్రకారం, మహిళలు అతి తక్కువగా పని చేస్తున్న దేశాల్లో, 131 దేశాలకు ఇచ్చిన ర్యాంకింగ్ లో మనది 120 వ స్థానం లభించింది. 2007 నుంచి మన దేశంలో మహిళా సిబ్బంది సంఖ్య తగ్గుతూ వస్తుంది. అలాగే ఉద్యోగాల కల్పనలో కూడా మన దేశం వెనకబడే వుంది. మన దేశంలో మొత్తం మహిళల సంఖ్యలో 42 శాతం గ్రాడ్యుయేట్స్ కాగా, వీరిలో 35 శాతం మాత్రమే ఉద్యోగాలకు వెళుతున్నట్లు నివేదిక పేర్కొంది. మిగిలిన 65 శాతం అస్సలు పనే చేయడం లేదు మన దేశం కన్నా బంగ్లాదేశ్, చైనా, జపాన్ వంటి దేశాలు ఈ విషయంలో ఎంతో ముందున్నారు. ఉద్యోగాలు చేసే మహిళల్లో 20 శాతం మంది మాత్రమే సేవా రంగంలో వున్నారు. ప్రోత్సాహాలు, ఉద్యోగ బాధ్యత అందరికీ సమన అవకాశాలు కల్పించే విధానం వల్ల మత్రమే మహిళా సిబ్బంది సంఖ్య పెరిగే అవకాశం వుందని ప్రపంచ బ్యాంకు ఆర్ధిక వేత్త ఫెడరికోగిల్ శాండర్ ఈ నివేదికను విశ్లేషిస్తూ అభిప్రాయం వ్యక్తం చేసారు.

Leave a comment