నీహారికా,

ఆడపిల్లలు చదువును ఇష్టపడి, తమ కెరీర్ కు చదువే ఆధారం అని తేల్చుకొనివిద్యావంతులై ఉద్యోగాలు సంపాధించేక ఆ ఉద్యోగం వల్ల వాళ్లకి  కలిగే మేలు కంటే నష్టమే ఎక్కువ కనిపిస్తోంది. ఎడతెరిపి లేని చాకిరితో వారు అనారోగ్యానికి చేరువగా ఉన్నారు. ఉద్యోగంలో ఉన్న ఒత్తిడి, పెరిగిన పని గంటలు, వేళకు సక్రమైన ఆహారం తీసుకోలేని ఆఫీస్ పని, ఇటు గృహిణిగా, ఉద్యోగినిగా, తల్లిగా భాద్యతలు కలగలసి పోయి వారిపై వర్క్ భారం అనంతం.గృహిణిగా వారు అనుభవించిన వత్తిడి కన్నా ఇది 20 రెట్లు ఎక్కువ. ఈ వత్తిడి తో వారి ఆహారపు అలవాట్లు మారుతున్నాయి. చిరుతిండ్లు పెరుగుతున్నాయి. విశ్రాంతిగా శుభ్రంగా, శుచిగా ఉండే భోజనానికి దూరం అవుతున్నారు. వీటి పలితాలేమో అనారోగ్యం. ఒక సర్వే ప్రకారం, నూటికి 50 నుంచి 60 శాతం వరకు ఉద్యోగినులు ఏదో ఒక ఆరోగ్య సమస్య తోనే ఉన్నారు. ఆ సమస్య కేవలం శారీరక అనారోగ్యం వల్ల కాక, మానసిక వత్తిడికి సంబంధించినదిగా ఉన్నాయి. ఈ పరిస్థితి నుంచి బయట పడే విధానాల దిశగా ముందుగా ఆలోచించవలసిన అవసరం ఉంది.

Leave a comment