ఉలవచారు ఇప్పుడు అందరికి తెలుసు కాని మొలకెత్తించిన ఉలవలతో పప్పు,ఇడ్లీలు ఏవైన చేయవచ్చు. ఇది ప్రపంచంలో అత్యంత ప్రాచీన ధాన్యం దక్షిణాదిలో భారతదేశంలోని కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో వాటిని అధికంగా వాడతారు. వాటీల్లో ప్రోటీన్స్ ,ఐరన్, కార్బో హైడ్రేట్స్, కాల్షీయం,పాస్పరస్, ఫైబర్ దొరుకుతాయి. చక్కెర స్థాయి క్రమబద్దికరించటంలో, రక్తపోటు నియంత్రణలో ఇవి ఉపకరిస్తాయి. వాటిని నీళ్ళలో 8 నుంచి పది గంటలు నాననిచ్చి ఆ నీరు తాగితే తొలిదశలో కిడ్నీలోని రాళ్ళు కరిగిపోతాయి. డైయారిక్ గుణాలలో శారీరక నీటి నిల్వలను సమతౌల్యపరుస్తాయి. ఆర్ధరైటీస్, రుతు సంబంధిత సమస్యలకు వైద్యులు ఉలవలను సిఫారసు చేశారు.

Leave a comment